ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ తరపున గెలిచి రెబల్ అభ్యర్థి గా పేరు తెచ్చుకున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. అయితే ఇటీవల రఘురామ కృష్ణంరాజు కి సంబంధించిన పలు ఆస్తుల పై సీబీఐ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీటన్నిటి పై సమాధానం ఇస్తూనే, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేయించడమే సీఎం జగన్ లక్ష్యం గా పెట్టుకున్నారు అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు.
అయితే తన పై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం లో ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారి ఆయన బ్యాచ్ మేట్ తో పావులు కదిపి విజయవంతం అయ్యారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ పర్యటన లో సీఎం జగన్ రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేశారు అని, తనను అరెస్ట్ చేయించేవరకు అన్నం కూడా తినేలా లేరనే మంకు పట్టుదలతో సీఎం జగన్ ఉన్నట్లు తాడేపల్లి వర్గం నుండి సమాచారం ఉంది అని తెలిపారు. అయితే సిబిఐ కేసుల నుండి బయట పడేందుకే ప్రవీణ్ ప్రకాష్ ను తెచ్చుకున్నారు అని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.