ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని గ్రామాల రైతులు, మహిళలు 300 రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై మాట్లాడిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా ఎప్పటికి అమరావతినే కొనసాగుతుందని అన్నారు.
అయితే అమరావతి రాజధాని కొనసాగింపు రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని తాను సవాలు విసిరితే, వైసీపీ నేతలు తన సవాల్‌కు తోక ముడిచారని అన్నారు. కాగా అమరావతి కొనసాగింపు ఉద్యమం 300 రోజులుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇకపై ఈ ఉద్యమాన్ని రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనగా చేపట్టాలని అన్నారు. అమరావతి రైతుల సమస్య కాదని, ఇది ప్రజలందరి సమస్య అని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు జగన్ ఓ మాట మాట్లాడి, తీరా గెలిచాక మాట మారుస్తున్నారని అన్నారు.