నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపణలు..!

Monday, August 17th, 2020, 07:12:21 AM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ సర్కార్‌పై మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వ నిఘావర్గాలు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఆయన లేఖ రాశారు.

అయితే కొన్ని నెలలుగా తాను వాడుతున్న రెండు ఫోన్ నెంబర్లు ట్యాప్ చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. కొద్ది రోజుల నుంచి తన ఫోన్‌లో సౌండ్స్ వస్తున్నాయని, ఫోన్ మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తుందని తెలిపారు. ఏపీ నిఘా వర్గాలు ఇలా చేయడం సరికాదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 19, 21ను ఉల్లంఘించడమేనని అన్నారు. అంతేకాదు తనకు తరచు బెదిరింపు కాల్స్‌ కూడా వస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు.