సీఎం జగన్ అలా పోల్చడం బాధాకరం – ఎంపీ రఘురామ కృష్ణంరాజు

Sunday, August 16th, 2020, 12:08:40 AM IST

Raghurama-Krishnam-Raju

నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఇచ్చిన ప్రసంగం లో రాష్ట్రం లోని విద్యా మార్పుల పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంగ్ల మాధ్యమం గురించి సైతం జగన్ పలు విషయాలను వెల్లడించారు. అయితే సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు గానూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరి పట్ల మరొకసారి అసహనం వ్యక్తం చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలు పరిస్థితుల పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనదైన శైలిలో స్పందిస్తూ నే ఉన్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇలా స్పందిచారు. సీఎం జగన్ తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనం తో పోల్చడం బాధాకరం అని అన్నారు. ఆంగ్ల మాధ్యమం ను కొందరు అడ్డుకుంటున్నారు అని చెప్పడం దురదృష్ట కరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వైసీపీ లో ఉంటూనే జగన్ నిర్ణయాల పై పలు విమర్శలు చేస్తుండగా, మరొకసారి రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.