సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ.. ఈ సారి ఎందుకంటే..!

Friday, July 31st, 2020, 01:31:04 PM IST

ఏపీ సీఎం జగన్‌కు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి లేఖ రాశారు. ఆగస్టు 5వ తేదిన అయోధ్యలో రామమందిరం భూమి పూజ జరగబోతుందని, అది కోట్లాది మంది చిరకాల ప్రజల కోరిక అని అన్నారు. అయితే ఆ పవిత్రమైన రోజున ఏపీలోని దేవాదాయ శాఖ పరిధిల్లో ఉన్న 24వేల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం చేయాలని కోరారు.

అంతేకాదు ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే భూమి పూజ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఈ మేరకు దేవాదాయ శాఖను ఆదేశించాల్సిందిగా లేఖ ద్వారా విజ్ణప్తి చేశారు. అయితే అయోధ్య రామ మందిరంపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖలో కోరినట్టు సీఎం జగన్ చేయిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.