సీఎం జగన్‌కు లేఖ రాసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ఏం కోరారంటే?

Monday, December 7th, 2020, 04:30:36 PM IST

MP-Raghurama-Krishnam-Raju

ఏపీ సీఎం జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ రాశారు. ఏలూరులో వింత వ్యాధి కారణంగా వందల మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవుతున్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. అయితే ఈ ఘటన తీవ్రంగా కలిచివేస్తుందని ఎంపీ రఘురామ అన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ, పరిసర ప్రాంతాలలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీఎం జగన్‌ను కోరారు.

అంతేకాదు ఏలూరుకు నిపుణులైన వైద్యులను, అవసరమైన మందులను వెంటనే పంపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఎయిమ్స్‌తో పాటు ఇతర ప్రముఖ వైద్యులను సంప్రదించి ఈ వింత వ్యాధికి పరిష్కార మార్గం కనుగొనాలని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృత పరిశోధన సదుపాయాలు ఉన్న ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరెడ్డితో కూడ మాట్లాడాలని సూచించారు. దీనిపై వ్యక్తిగత శ్రద్ద తీసుకుని సమస్య మూలాలను తెలుసుకుని పరిష్కరించాలని కోరారు.