అది వాయిదా వేయండి.. సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ..!

Sunday, August 23rd, 2020, 07:40:54 PM IST

ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం భావిస్తుందని దానిని వెంటనే వాయిదా వేయాలని కోరారు. రాష్ట్రంలో రోజుకు 10 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయని ఇలాంటి సమయంలో స్కూళ్లు తెరిస్తే పిల్లలకు కరోనా సోకుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

అంతేకాదు చిన్న పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, పిల్లలకు కరోనా సోకినా, మృత్యువాత పడిన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. మన ప్రభుత్వం పాఠశాలలు బాగుచెయ్యాలని నాడు- నేడు, అమ్మఒడి, పిల్లలకు జగన్అన్న గోరు ముద్ద వంటి ఎన్నో మంచి పధకాలను ప్రవేశ పెట్టిందని ఇప్పుడు స్కూళ్ళు తెరవడంలో తొందరపడవద్దని ఈ అంశంపై అంశంపై అందరి సలహాలు, సూచనలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో పిల్లల తల్లి తండ్రుల మనోభావాలు, పిల్లల ఆరోగ్యం పట్ల వారి ఆందోళను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని కోరారు.