మీకు హిందువులంటే ఎందుకు చులకనా.. జగన్‌కు రఘురామ సూటి ప్రశ్న..!

Wednesday, December 30th, 2020, 03:03:59 AM IST

Raghurama-Krishnam-Raju
ఏపీ సీఎం జగన్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికి తీసుకువెళ్లిన ఘటన చాలా దారుణమని అన్నారు. మీ ప్రభుత్వంలో ఈ ఘటన జరగడం చాలా సిగ్గుచేటని అన్నారు. జీసస్ విగ్రహం తల నరికి ఎవరైనా తీసుకువెళితే నిందితులను క్షణాల్లో పట్టుకుంటారని, కానీ హిందూ దేవాలయాలపై దాడి జరిగితే ఎనుదు బాధ్యులను పట్టుకోవడం లేదని అన్నారు.

అయితే ఇలాంటి ఘటనలు రోజుకొకటి జరుగుతున్నా, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా కనీసం సీఎం జగన్ స్పందించడంలేదని, మీకు హిందువులంటే ఎందుకంత చులకనా అని ప్రశ్నించారు. హిందూ ఆలయాలపై దాడులు చేసేవారిని తక్షణం పట్టుకునేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని, ఈ ఘటనలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.