మనస్సాక్షిని నమ్మండి, సాక్షిని కాదు.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలనం.!

Monday, August 3rd, 2020, 02:59:39 PM IST

MP-Raghurama-Krishnam-Raju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం గత కొద్ది రోజులుగా పార్టీలో తీవ్ర కలకలం రేపుతుంది. అయితే తాజాగా మూడు రాజధానుల అంశంపై స్పందించిన రఘురామ కృష్ణంరాజు పవన్ రాజీనామాపై కూడా స్పందించారు. రాజీనామాలు వృథా ప్రయాస అని చేయాల్సింది రాజీనామాలు కాదని, రాజీలేని పోరాటమని అన్నారు.

అంతేకాదు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన బీటెక్ రవి గురించి కూడా మాట్లాడిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని, కౌన్సిల్‌లో ఉండి పోరాటం చేయాలని సూచించారు. ఇకపోతే ప్రజలు సంతోషంగా ఉన్నారని గుండెల మీద చేయి వేసుకుని ఏ నాయకుడైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. మనస్సాక్షిని నమ్మాలని, సాక్షిని కాదని, అమరావతికి వ్యతిరేకమై ప్రజాప్రతినిధులు రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని అన్నారు. ఇక జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ అవి గెలుపు గుర్రాలు అని నమ్మకండని, ఎన్నికల ముందు చంద్రబాబు 10వేలు ఇస్తే ప్రతిపక్షంగా ఎంత కంగారుపడ్డామో తెలియదా అని, అవి టీడీపీకి ఓట్లు తీసుకురాలేదని ఈ విషయాన్ని వైసీపీ నేతలు గుర్తించుకోవాలని అన్నారు.