అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్..!

Sunday, September 20th, 2020, 03:10:30 PM IST

Raghurama-Krishnam-Raju

తిరుమల శ్రీవారి దర్శనార్థం కొరకు వచ్చే ఏ మతస్థులైనా ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా ఎవరూ డిక్లరేషన్‌ ఇచ్చిన సందర్భాలు లేవని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై నేడు మరోసారి మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిప్పులు చెరిగారు.

ఏపీలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని, హిందువుల మనోభావాలకు భంగం కలుగుతుందని అన్నారు. తిరుమలకు వచ్చే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాసిందేనని డిమాండ్ చేశారు. ఒకరి కోసం టీటీడీ పద్దతులను మార్చడం సరికాదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసే అధికారం టీటీడీ చైర్మన్‌కు లేదని, సీఎం జగన్ తిరుమలకు వెళ్తే ఆయన కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను నేను ప్రశ్నిస్తున్నాననే వైసీపీ నుంచి బహిష్కరించారని అయిన ప్రజల సమస్యల గురుంచి నేను మాట్లాడుతున్నాను కాబట్టే నన్ను వారు అక్కున చేర్చుకున్నారని అన్నారు.