ప్రభుత్వం పారదర్శకత నిరూపించుకోవాలి.. ఎంపీ రఘురామ సరికొత్త డిమాండ్..!

Tuesday, January 5th, 2021, 08:24:32 PM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రభుత్వానికి సరికొత్త డిమాండ్ వినిపించారు. నిన్న సీఎం జగన్ రామతీర్ధం ఘటనపై డీ.ఎస్.పి. సునీల్ కుమార్ గారి నేతృత్వంలో సీబీసీఐడీ విచారణకు ఆదేశించారని అన్నారు. అయితే సునీల్ కుమార్ గతంలో కొన్ని సందర్భాలలో హైకోర్టు ఆదేశాలు పాటించకుండా ప్రభుత్వ పక్షాన పనిచేసినందుకు హైకోర్టు మందలించి ఆ కేసును సీబీఐకి అప్పగించడం జరిగింది.

అయితే సునీల్ కుమార్ గారు క్రైస్తవ మతాన్ని అనుసరించే వ్యక్తి అని, ఈ కేసు దర్యాప్తు ఒక వర్గం మీద జరుగుతున్న దాడులకు సంబంధించినది కాబట్టి కోర్టు చెప్పినా కేసులు పెట్టని అధికారికి ఈ కేసు అప్పగించడం వలన విచారణ సరిగా జరగదేమో అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని రఘురామ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ చేసేందుకు క్రైస్తవ మతానికి మరియు రెడ్డి కులానికి సంబంధం లేని వారి ఆధ్వర్యంలో నడిచేలా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మరియు పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరముందని అన్నారు.