మగాడు, మొనగాడు అనుకున్నా.. సీఎం జగన్‌పై రఘురామ హాట్ కామెంట్స్..!

Monday, September 21st, 2020, 12:55:38 PM IST

Raghurama-Krishnam-Raju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నేడు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిపై ప్రజాభిప్రాయాన్ని అడిగి తెలుసుకోండని, మన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించండని అన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా అందరికి న్యాయం చేయండని అన్నారు. అయితే గతంలో నేను చెప్పినట్టుగానే నాపై కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారని, నన్ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తితోనే కేసులు పెట్టిస్తున్నారని అన్నారు.

జగన్ మగాడు, మొనగాడు అనుకున్నానని కానీ ఈ రకంగా స్థాయి తగ్గించుకుంటాడని అనుకోలేదని అన్నారు. మీ స్థాయి ఉన్నతంగా ఉండాలని అనుకునే వ్యక్తులలో నేను ఒకడిని అని కానీ మీరు ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. నాస్థాయి పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది కానీ మీ స్థాయి తగ్గడం బాధగా ఉంది దయచేసి ప్రజల దృష్టిలో మీ స్థాయిని తగ్గించుకోకండని అన్నారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల వలన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అందుకోసం హిందువుల తరుపున పోరాడేందుకు సనాతన స్వదేశీ సేవ పేరుతో సొసైటీనీ కూడా రిజిస్ట్రేషన్ చేశామని ఇకపై ఎక్కడైనా హిందువుల మనోభావాలకు భంగం కలిగితే ఈ ఆర్గనైజేషన్ కూడా పోరాడుతుందని అన్నారు.