వారిని కనిపెట్టి శిక్షించండి.. జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు సజేషన్..!

Tuesday, August 18th, 2020, 08:34:27 PM IST


వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొద్ది రోజుల నుంచి వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నేడు మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తన చుట్టూ ఉండే కట్టప్పలను గుర్తించాలని లేదంటే చాలా ప్రమాదమని అన్నారు.

అయితే అవినీతిని ప్రోత్సహించని ముఖ్యమంత్రిగా మీకు పేరుందని కానీ మీ పక్కనే ఉంటూ అవినీతికి పాల్పడుతున్న కట్టప్పని మీరు పట్టుకోవాలని అన్నారు. సినిమాలో కట్టప్ప బాహుబలిని పొడిచేశాడు. కానీ ఈ కట్టప్పను మీరు కనిపెట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వసనీయతను కాపాడుకోవాలంటే అతి త్వరలో ఆ కట్టప్పను పట్టుకుని శిక్షించాలి అని అన్నారు. అలాంటి కట్టప్పలు చాలా మంది మీ పక్కన ఉంటూ మోసం చేస్తున్నారని అన్నారు.