సీఎం జగన్ పారదర్శకత నిరూపించుకోవాలి – రఘురామకృష్ణంరాజు

Friday, August 28th, 2020, 04:13:54 PM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. విశాఖలోని కాపులుప్పాడలో ప్రభుత్వం చేపడుతున్న గెస్ట్‌ హౌస్‌ నిర్మాణంపై కేంద్ర పర్యాటక శాఖమంత్రికి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులుప్పాడ పర్యాటక ప్రాంతం దురదృష్టవశాత్తు రాష్ట్ర పరిధిలోనే ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో ఆవ భూముల కుంభకోణం బయటకు వస్తుందని, ఆవ భూములపై విచారణను స్వాగతిస్తున్నా అని అన్నారు.

అయితే తణుకు నియోజకవర్గంలోనూ ఇళ్ల స్థలాలలో కుంభకోణం జరిగిందని సీఎం జగన్ పారదర్శకత నిరూపించుకోవాలని అన్నారు. మాటల్లోనే కాదు, చేతల్లోనూ జగన్ సూపర్‌ అని అనిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అంబటి కృష్ణారెడ్డికి కేబినెట్‌ హోదా కల్పించారని కులాన్ని బట్టి పోస్టు ఇవ్వొద్దని అర్హతలను బట్టి పోస్టులు ఉండాలని సూచించారు. సీఎం జగన్ తన సలహాదారులను తగ్గిస్తే మంచిదని ఇది తన అభిప్రాయం కాదని ప్రజల అభిప్రాయం అని అన్నారు. రాస్ట్రంలో ఇసుక కొరతపై దృష్టి సారించాలని అన్నారు. పెయిడ్ ఆర్టికల్స్ నిజమని నమ్మకండని, మన పేపర్‌లో వచ్చేవన్ని నిజం కాదని గుర్తించుకోవాలని అన్నారు.