రాజధాని రైతులకు న్యాయం జరుగుతుంది.. తేల్చి చెప్పిన ఎంపీ రఘురామ..!

Thursday, August 20th, 2020, 03:50:50 PM IST

Raghurama-Krishnam-Raju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేడు మరోసారి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో రైతులు ఏ మాత్రం అధైర్యపడకండని తప్పకుండా రైతులకు న్యాయం జరిగి తీరుతుందని అన్నారు. రాజధాని నిర్ణయంపై రాష్ట్రాలదే అని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌లో చెప్పడం బాధాకరమని అన్నారు.

అయితే విశాఖపట్టణం ఇప్పటికే అభివృద్ధి చెందిందని, శ్రీకాకుళంలో చాలా పరిశ్రమలు ఉన్నాయని ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చేయాల్సిన పనిలేదని అన్నారు. అభివృద్ధి చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలను చెడగొట్టకుండా ఉంటే చాలని అన్నారు. సీఎం జగన్‌కు రాయలసీమపై నిజమైన ప్రేమ ఉంటే అమరావతిలోనే రాజధానిని ఉంచి, రాయలసీమలో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని అన్నారు.