ఎంపీ రఘురామపై మరో ఎంపీ నందిగాం సురేశ్ సెటైర్లు..!

Friday, October 23rd, 2020, 11:19:07 PM IST


వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ సెటైర్లు వేశారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు గురుంచి మాట్లాడుకోవడం టైం వేస్ట్ పని అని ఎద్దేవా చేశారు. ఆయన వ్యవహారం ప‌గ‌లు విగ్గు, రాత్రి పెగ్గు అంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు మూడు రాజధానులు ఉండాలని, అమరావతిలో తమకు కూడా ప్లాట్లు కావాలని దీక్షలు చేస్తున్న పేదలపై టీడీపీ నేతలు దాడులు చేశారని మండిపడ్డారు.

అయితే అమరావతిలో మూడు రాజధానుల కోసం దీక్షలు చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులు అని టీడీపీ నేతలు ఆరోపించడం దారుణమని అన్నారు. అయితే అమరావతిలో ఆర్టిస్ట్ ల‌ను, సినిమా యాక్ట‌ర్ ల‌ను పెట్టి ధర్నాలు చేయిస్తుంది ఎవ‌రో అంద‌రికి తెలుసని అన్నారు. ప్లాట్ల కోసం ధర్నాలో పాల్గొన్న పేదవారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఏ ఉద్య‌మంలో ఎంత నీతి, నిజాయితీ ఉందో మున్ముందు తెలుస్తుందని అన్నారు.