వైసీపీ ఎంపీ మోపిదేవి, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి తప్పిన ప్రమాదం..!

Friday, August 21st, 2020, 02:23:49 PM IST

వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి పెను ప్రమాదం తప్పింది. వీరిద్దరు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ రోడ్డుపక్కన ఉన్న ఓ కారును బలంగా ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు తగలలేదు.

అయితే పూర్తి వివరాలలోకి వెళితే ఎంపీ మోపిదేవి, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఇద్దరు ఒకే వాహనంలో విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళుతుండగా తాళ్లపాలెం జంక్షన్ వద్ద వీరి కాన్వాయ్‌ మధ్యలోకి ప్రైవేట్ వాహనం ప్రవేశించడంతో మోపిదేవి వాహనం ఆ వాహనాన్ని ఢీకొట్టింది. వెనక నుంచి మరో కారు కూడా మోపిదేవి కారును ఢీకొట్టడంతో ఆయన కారు స్వల్పంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎంపీ మోపిదేవి, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సేఫ్‌గా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.