బెయిల్ రాకపోవడంతో కొత్త డ్రామాలకి తెరతీశారు – ఎంపీ మిథున్ రెడ్డి

Monday, May 17th, 2021, 02:21:25 PM IST


నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహరం తెలుగు రాష్ట్రాల్లో చర్చంశనీయంగా మారింది. అయితే ఎంపీ రఘురామ కృష్ణంరాజు చర్యల వెనుక తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే రఘురామ పని చేస్తున్నారు అని, బెయిల్ రాకపోవడం తో కొత్త డ్రామాలకి తెరతీశారు అంటూ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. అయితే కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఆయన అకారణంగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు అని, కుటుంబ సభ్యులను పావులుగా వాడుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాక ప్రాణహాని ఉందంటూ కేసును డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అయితే తెలుగు దేశం పార్టీ నేతలు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇంత హడావిడి చేయని చంద్రబాబు, ఇప్పుడు మాత్రం హైరానా పడుతున్నారు అంటూ విమర్శించారు. పెద్ద కుట్రతో నే రాష్ట్రపతికి లేఖ రాశారు అంటూ చెప్పుకొచ్చారు.జగన్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర జరుగుతోంది అని, ఈ విషయాన్ని లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అయితే పోలీసులు కొట్టలేదు అని వైద్య బృందం నివేదిక ఇచ్చింది అని అన్నారు. అయితే రమేష్ ఆసుపత్రి లోనే ట్రీట్మెంట్ జరగాలి అని అనడం సరికాదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.