హైకోర్టుకు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి లేఖ.. కారణం అదే..!

Friday, March 26th, 2021, 03:00:54 AM IST


తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైకోర్టుకు ఓ లేఖ రాశారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని తుర్కయాంజల్‌లో తులిప్స్ గ్రాండ్ హోటల్‌పై హైకోర్టుకు ఫిర్యాదు చేశారు హెచ్ఎండీఏ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని లేఖలో పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుండా అక్రమంగా నిర్మించిన తులిప్స్ హోటల్‌ను మంత్రి, ఎమ్మెల్యే ప్రారంభించారని ఆరోపించారు.

అయితే హెచ్ఎండీఏ పరిధిలో ఇలాంటి ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తెలిపారు. అయితే ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖను హైకోర్ట్ స్వీకరించింది. అయితే ఇందులో తులిప్స్ గ్రాండ్ హోటల్ యాజమాన్యాన్ని ప్రతివాదిగా చేర్చుతూ దీనిపై నాలుగు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, తులిప్స్‌ హోటల్ యాజమాన్యానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.