వాటిని కాపాడండి ముఖ్యమంత్రి గారూ – కేశినేని నాని

Wednesday, September 2nd, 2020, 05:00:13 PM IST

ఇటీవల మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ కొండపల్లి బొమ్మల గురించి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ దేశాలకు మన కళలను పరిచయం చేయాలి అంటూ స్వయం సమృద్ది దిశగా అడుగులు వేయాలని సూచించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మాటలను గుర్తు చేస్తూ, తెలుగు దేశం పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

సాక్ష్యాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రశంసలు పొందిన ప్రాచీన కళ కొండపల్లి బొమ్మల తయారీ అరుదైన ప్రపంచ ప్రఖ్యాత బొమ్మలు తయారు చేయటానికి ఉపయోగించేతెల్ల పుణికి కలప కొండపల్లి అడవుల్లో మాత్రమే దొరుకుతుంది అని అది మీ వైసీపీ వారు భారీ నుండి కొండపల్లి అడవులను కాపాడండి ముఖ్యమంత్రి గారూ అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలు సమస్యల పై తనదైన శైలిలో పోరాటం చేస్తున్న కేశినేని నాని మరొకసారి రాష్ట్రం లో నీ సమస్య ల పై సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టి కి తీసుకురావడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.