తమరు ఏమి చేసినా భారీ స్థాయిలోనే ఉంటుంది

Thursday, January 21st, 2021, 12:41:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న కొత్త నిర్ణయం సర్వత్రా చర్చంశనీయం గా మారింది. రేషన్ ను డోర్ డెలివరీ చేసేందుకు సేవలను ప్రారంభించారు. అయితే ఈ మేరకు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ఫోటో రూపం లో బంధించారు. దీని పై పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. తమరు ఏమి చేసినా భారీ స్థాయిలోనే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.

అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై పలువురు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.ప్రచార ఆర్భాటం ఎక్కువ, పని తక్కువ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అవినీతి తో సహా అన్ని భారీ గానే అంటూ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ అభిమానులు సైతం ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యల పై విమర్శలు చేస్తున్నారు. జగన్ పాలనా విధానం పై ప్రశంసల వర్షం కురిపిస్తూ, టీడీపీ పై విమర్శలు చేస్తున్నారు.