ఏపీ లో అరాచక పాలన కొనసాగుతోంది – కేశినేని నాని

Wednesday, February 10th, 2021, 09:45:19 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అరాచక పాలన కొనసాగుతోంది అంటూ తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అని, రాజ్యాంగ వ్యవస్థల పై దాడులు జరుగుతున్నాయి అని, అధికారంలో కి వచ్చాక ఏపీ కి ప్రత్యేక హోదా ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విస్మరించారు అని, పోలవరానికి నిధులు కూడా తేలేక పోయారు అని, అప్పులు మాత్రం లక్షా పదిహేను వేల కోట్ల రూపాయలు పెరిగిపోయాయి అని రాజ్యసభ లో చెప్పిన విషయాన్ని వెల్లడించారు.అయితే రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు మాత్రమే కాకుండా, విశాఖ ఉక్కు కర్మాగారం పై నాని పలు వ్యాఖ్యలు చేశారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తో సుదీర్ఘ పోరాటంతో సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారంఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక గా నిలిచింది అని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని పునః పరిశీలించాలి అని, స్వంత గనులు కేటాయించి లాభాల బాటలో నడిచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.ఈ అంశం పై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి పూర్తి విషయాలను వివరించి, ప్రైవేటీకరణ చేయడాన్ని నిలిపి వేయాలని కోరిన విషయాన్ని వెల్లడించారు.