గూగుల్‌లో ఖైదీ నెంబర్‌ 6093 అని సెర్చ్ చేస్తే జగన్ పేరు వస్తుంది – ఎంపీ కనకమేడల

Thursday, February 4th, 2021, 05:25:20 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యసభలో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, కోర్టులంటే ప్రభుత్వానికి లెక్కలేని తనం ఏర్పడిందని కనకమేడల అన్నారు. పంచాయితీ ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవాలు చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని, ప్రశ్నించిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆరోపించారు.

అంతేకాదు జగన్‌ అసమర్థ పాలనతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించిందని కనకమేడల అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అన్ని విధాల వెనకపడిపోయిందని అన్నారు. గూగుల్‌లో ఖైదీ నెంబర్‌ 6093 అని టైప్‌ చేస్తే జగన్ పేరు వస్తుందని అలాంటి వ్యక్తి సీఎం అవ్వడం దురదృష్టకరమని అన్నారు. అమరావతిని పక్కనపెట్టి మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చారని రాజధాని రైతుల ఆందోళనను అసలు పట్టించుకోవడం లేదని అన్నారు.