సీఎస్ సోమేష్‌కుమార్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ.. ఏం కోరారంటే?

Wednesday, January 6th, 2021, 07:30:08 PM IST

తెలంగాణ సీఎస్ సోమేష్‌కుమార్‌కు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ రాశారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర మైనింగ్‌ శాఖ ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. అక్రమాలకు పాల్పడిన వ్యాపారులపై చర్యలు తీసుకోకపోగా, తిరిగి వారికే కొత్తగా మైనింగ్‌ కోసం భూములు కేటాయించడం సరికాదని ధర్మపురి అర్వింద్ లేఖలో పేర్కొన్నారు. రోజు రోజుకు రాష్ట్రంలో మైనింగ్ వ్యాపారుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.