మంత్రి కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్..!

Monday, November 9th, 2020, 06:38:05 PM IST

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సాయం ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బే అని, కేటీఆర్ జేబులో నుంచి ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యకర్త అభిషేక్ ఇల్లు మునిగిందని అధికారులు గుర్తించి పదివేలు ఇస్తేనే తీసుకున్నాడని, పరిహారం రానివారి కోసం ఆయన పోరాటం చేస్తుంటే కేటీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

అయితే సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు ఇలా అందరి జీతాలు ప్రజల డబ్బేనన్నారు. ప్రజల డబ్బులనే ఇస్తూ టీఆర్ఎస్ డబ్బా కొట్టుకుంటుందని అన్నారు. ఇప్పటికే దుబ్బాకలో ఏడు చెరువుల నీళ్లు తాగించాం. ఖబర్దార్ కేటీఆర్ వచ్చే ఎన్నికలలో సిరిసిల్లలో నువ్వు ఓడకపోతే నన్ను అడుగు అంటూ అర్వింద్ సవాల్ విసిరారు. అక్రమ కట్టడాలు కూల్చడంలో గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ 2 లక్షల అక్రమ కట్టడాలను కూల్చేశారని అది చూసి కేటీఆర్ నేర్చుకోవాలని అన్నారు.