బ్రేకింగ్: బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్..!

Friday, August 7th, 2020, 12:03:22 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అధికార పార్టీ వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్‌కి కూడా కరోనా సోకింది.

అయితే కరోనా టెస్టు చేయించుకోగా తనకు కరోనా పాజిటివ్ అని తేలినట్టు ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి, బాగానే ఉందని, వైద్యుల సలహా మేరకు ఐసొలేషన్‌లో ఉన్నట్టు తెలిపాడు. సీఎం రమేశ్‌కి కరోనా సోకిందని తెలియగానే అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.