సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్..!

Wednesday, March 3rd, 2021, 03:00:57 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం అని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌పై టీఆర్ఎస్ రోజుకో ఉత్తరం రాస్తూ తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఐటీఐఆర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పాలనాపరమైన అడుగులు కూడా ముందుకు వేయని మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

అయితే రైల్వే, ఎంఎంటీ ఎస్, రేడియల్ రోడ్ల అభివృద్ధి చేసినట్లయితే ఐటీఐఆర్ ప్రాజెక్టును కొనసాగించడానికి కేంద్రం సిద్ధంగా ఉండేదని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సహాయ నిరాకరణ చేసి ప్రాజెక్టు అమలు కాకుండా ఆగిపోయేందుకు కారణమయ్యిందని బండి సంజయ్ ఆరోపించారు.