నిరాహార దీక్షను విరమించిన ఎంపీ బండి సంజయ్..!

Tuesday, October 27th, 2020, 11:23:14 PM IST


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆస్పత్రిలో దీక్షను విరమించారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కరీంనగర్ బీజేపీ పార్టీ ఆఫీసులో బండి సంజయ్ దీక్షకు దిగారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.

మాజీ ఎంపీలు వివేక్, జితేందర్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి బండి సంజయ్‌ చేత దీక్ష విరమింపజేశారు. కరీంనగర్‌లో తన కార్యాలయంలో గత రాత్రి నుంచి దీక్షకు దిగిన సంజయ్ కేసీఆర్, హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము ధైర్యం లేదని, ఓటమి భయంతోనే పిచ్చి పనులు చేస్తున్నారని అన్నారు. దుబ్బాకకు వస్తున్న డబ్బులు అన్ని కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే అని ముందు కేసీఆర్ ఫామ్ హౌస్‌ను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.