గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ నాయకుల బాక్సులు బద్ధలు కొడతాం – బండి సంజయ్

Tuesday, November 10th, 2020, 03:00:19 AM IST

Bandi-Sanjay
టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ చీప్, ఎంపీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ నియంత, నకృష్ట ముఖ్యమంత్రి అని తెలంగాణలో బియ్యం, డబుల్ బెడ్రూమ్, రోడ్లు, లైట్లు, టాయిలెట్ల పైసలన్ని కేంద్రం ఇస్తుంటే కేసీఆర్ మాత్రం తానే ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. నగరంలో వరదల సమయంలో అసలు కేసీఆర్ బయటకే రాలేదని ఎద్దేవా చేశారు. నష్టంపై ఇంటింటికీ సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అయితే వచ్చే గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ నాయకుల బాక్సులు బద్ధలు కొడతామని, మేయర్ పదవిని బీజేపీ దక్కించుకోవడం ఖాయమని అన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని అన్నారు. బీజేపీ బరాబర్ హిందువుల పార్టీ అంటూ హిందూ ధర్మానికి అడ్డొచ్చిన వాళ్లను తొక్కేస్తామని హెచ్చరించారు. హిందువులను అవమానిస్తున్న ఎంఐఎంకు తగిన బుద్ధి చెప్తామని అన్నారు.