ప్రతిపక్ష నేత అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది – మోపిదేవి

Saturday, August 22nd, 2020, 12:20:12 PM IST

అధికార పార్టీ వైసీపీ తీరు పై వరుస ప్రశ్నలు వేస్తూ, ఘాటు విమర్శలు చేస్తున్నారు ప్రతి పక్ష పార్టీ నేతలు. అయితే చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేడు వినాయక చవితి సందర్భంగా ఆశీల్మెట్ట లోని సంపత్ వినాయక ఆలయాన్ని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ సందర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి ఎదురు అవుతున్న అడ్డంకులు ఈ వినాయక చవితి తో తొలగి సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని అని ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే ఈ మేరకు చంద్రబాబు నాయుడు తీరు పై పలు ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ తీసుకొస్తున్న ఎన్నో విప్లవాత్మక సంస్కరణ లకు చంద్రబాబు నాయుడు అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక చంద్రబాబు నాయుడు ను ప్రతి పక్ష నేత అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది అని విమర్శించారు. అయితే ప్రజల కోసం, వారి క్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్న జగన్ కి భగవంతుడి ఆశీస్సులు ఉండాలి కోరుకున్నారు. రాష్ట్రం లో కరోనా వైరస్ పరిస్థితుల పై, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై అధికార పార్టీ పై వరుస విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు.