చంద్రబాబు రాష్ట్ర ఆదాయాన్ని సొంత జాగీరుగా వాడుకున్నారు

Sunday, November 15th, 2020, 06:22:18 PM IST

వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మరొకసారి ప్రతి పక్ష పార్టీ ను టార్గెట్ చేస్తూ వరుస విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే, చంద్రబాబు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ 17 నెలల్లో నే అస్తవ్యస్తం గా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి ను గాడిలో పెట్టారు అని తెలిపారు. సీఎం జగన్ పాలనలో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాల పై ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది అని అన్నారు.

అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 90 శాతం పైగా 15 నెలల్లో అమలు చేసిన విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి గా జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి అస్తవ్యస్తంగా ఉందని, చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆదాయాన్ని సొంత జాగీరు గా వాడుకున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్తితిలో ఉన్న రాష్ట్రాన్ని సీఎం జగన్ 17 నెలల్లో గాడి పెట్టారు అంటూ కొనియాడారు. అంతేకాక సంక్షేమ పథకాల ద్వారా ఏడాది కి ఒక్కొక్కరికి 1.40 లక్షల రూపాయలకి పైగా లబ్ది పొందాలని చెబుతున్నారు అని తెలిపారు.