మనుషుల్ని వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజం

Tuesday, September 29th, 2020, 12:08:51 AM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరొకసారి ఘాటు విమర్శలు చేశారు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ. మనుషుల్ని వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉండగా బీసీ లను ఏనాడు పట్టించుకోలేదు అని ఆరోపించారు. అయితే అధికారంలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు కి బీసీ లు గుర్తుకు వస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు రాజకీయంగా, ఆర్దికంగా, సామాజికంగా ఒక్క పథకాన్ని కూడా బీసీ లకు అమలు చేయలేదు అంటూ విమర్శించారు.

చంద్రబాబు నాయుడు బీసీ లను ఓటు బ్యాంక్ రాజకీయాలను వాడుకున్నారు అంటూ మోపిదేవి వెంకటరమణ దారుణ వ్యాఖ్యలు చేశారు. అయితే బీసీ ల సామాజిక అభ్యున్నతి కి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు అని ఈ సందర్భంగా తెలియ జేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 57 బీసీ కార్పొరేషన్ లు ఏర్పాటు చేశారు అంటూ కొనియాడారు. 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే అందులో రెండు బీసీ లకు సీఎం జగన్ కేటాయించారు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే కార్యకర్త స్థాయి నుండి వచ్చిన వ్యక్తికి చంద్రబాబు నాయుడు ఏనాడైనా రాజ్యసభ పదవి ఇచ్చారా అంటూ సూటిగా ప్రశ్నించారు.