భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటన విజయవంతం అయిందని… అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలోని కీలక అధికారులు వెల్లడించారు. గత నెలలో తమదేశంలో పర్యటించిన మోడీ పర్యటన విజయవంతం అయిందని.. ఇక పలు విధాన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉన్నదని అమెరికా అధికారులు పేర్కొంటున్నారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన వాతావరణాన్ని మోడీ ప్రభుత్వం కల్పించాలని.. అధికారులు తెలియజేశారు. వాగ్దానాలు అమలుచేయడమే కీలకమని, ఫలితాలు అవే వస్తాయని.. అమెరికా అధికారులు పేర్కొన్నారు.
గతనెలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజులపాటు అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. మోడీ పర్యటనలో భాగంగా అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతేకాకుండా.. ఆయన అమెరికన్ టాప్ సిఈఓ లతో సమావేశం జరిపి వారిని దేశానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోడీ జరిపిన చర్చలు ఫలవంతం అయినట్టు తెలుస్తున్నది.