బిఎస్ఎఫ్ కు మోడీ సెల్యూట్

Monday, December 1st, 2014, 05:40:31 PM IST


భారత సరిహద్దు దళం అవతరణ దినోత్సవం సందర్భంగా మోడీ బిఎస్ఎఫ్ దళాలను పొగడ్తలతో ముంచెత్తారు. బోర్డర్ వద్ద నిరంతరం ప్రాణాలను లెక్క చేయకుండా దేశాన్ని రక్షిస్తున్న బిఎస్ఎఫ్ జవాన్లే నిజమైన హీరోలని మోడీ అన్నారు. నేడు బిఎస్ఎఫ్ 49వ అవతరణ దినోత్సవం అని… ఈ సందర్భంగా బిఎస్ఎఫ్ దళాలకు వందనం చేస్తున్నానని మోడీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. బిఎస్ఎఫ్ జవాన్ల పట్టుదల, దైర్యసాహసాలు మిగతా వారికీ సైతం స్పూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు.

ఈరోజు ప్రధాని మోడీ నాగాలాండ్ లో పర్యటిస్తున్నారు. ఈశాన్య భారతదేశంలో 14కొత్త రైల్వే లైన్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు మోడీ తెలిపారు. ఇందుకోసం కేంద్రం 28వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నదని మోడీ అన్నారు. నాగాలాండ్ లో టూరిజంను అభివృద్ధి చేయనున్నట్టు ఆయన తెలియజేశారు.