ఒబామాకు మోడీ అరుదైన బహుమతులు!

Tuesday, January 27th, 2015, 07:10:29 PM IST

obama_modi
భారతదేశ గణతంత్ర్య దినోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్రమోడీ విలువైన, ప్రత్యేకమైన కానుకలను అందజేశారు. కాగా వాటి వివరాలను మోడీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక ఒబామా తన వెంట తీసుకెళ్ళిన బహుమతులలో 1957లో భారత పర్యటనకు వచ్చిన అమెరికన్ సింగర్ మరియన్ ఆండర్సన్ మనదేశంలో పాడిన పాటల రికార్డులను, ఆ సమయంలో ఆకాశవాణిలో ప్రసారమైన ఆండర్సన్ ఇంటర్వ్యూ, గాంధీ స్మారకార్ధం ఆయన పాడిన ‘లీడ్ కైండ్లీ లైట్’ గీతం రికార్డులను మోడీ అందజేశారు.

అలాగే 1950 జనవరి 26న భారత్ లో విడుదలైన స్టాంప్ ను, అమెరికా నుండి తొలిసారి ఇండియా వచ్చిన టెలిగ్రాం ఒరిజినల్ కాపీని మోడీ బహుమతులుగా ఒబామాకు అందజేశారు. ఇక వీటితో పాటుగా విలువైన చీరలను, పలు బహుమతులను ఒబామా భారత్ నుండి బహుమతులుగా తన వెంట తీసుకెళ్ళారు.