మరో 20ఏళ్ళు తిరుగులేదు!

Friday, April 3rd, 2015, 05:29:23 PM IST


బెంగుళూరులో శుక్రవారం ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సులో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ దేశాన్ని మరో 20ఏళ్ళు పరిపాలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పార్టీ సాధించిన విజయాలు, అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ పది నెలలలో ప్రధాని నరేంద్రమోడీ సర్కారు సాధించిన ఘనతల గురించి కూడా అమిత్ షా తన ప్రసంగంలో ప్రస్తావించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ దేశంలో నూతన రాజకీయ సంస్కృతిని తీసుకు వచ్చామని, విధాన వైఫల్యాలకు చరమ గీతం పాడామని చెప్పుకొచ్చారు. అలాగే ‘మన పార్టీ అధికారంలోకి వచ్చింది.. భాజపా పార్టీ మరో పది నుండి ఇరవై ఏళ్ళపాటు అధికారంలో ఉంటుంది’ అంటూ అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.