ఎన్నో విజయాలతో స్వదేశానికి..!

Saturday, April 18th, 2015, 11:03:43 AM IST

modi
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్, జర్మనీ, కెనడాలను సందర్శించి శనివారం తెల్లవారుఝామున స్వదేశానికి చేరుకున్నారు. కాగా 9రోజుల ఈ పర్యటనలో మోడీ అద్భుత విజయాలను సాధించారు. ఇక మేక్ ఇన్ ఇండియా ప్రచారం, పలు ద్వైపాక్షిక అంశాలలో సహకారం, పెట్టుబడులు ప్రధానాంశంగా సాగిన మోడీ పర్యటన మంచి ఫలితాలనిచ్చింది.

అలాగే ఫ్రాన్స్ తో రాఫల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, జర్మనీలో మేక్ ఇన్ ఇండియాకు లభించిన మద్దతు, యురేనియం సరఫరాకు కెనెడా అంగీకారం మొదలగునవి మోడీ విజయానికి మచ్చు తునకలు. ఇక విదేశీ పర్యటన ద్వారా అనేక ఘన కార్యాలను నెరవేర్చుకొచ్చిన ప్రధాని మోడీకి భారత్ లో ఢిల్లీ భాజపా అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆత్మీయ స్వాగతం పలికారు.