కొనసాగుతున్న కౌంటింగ్.. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్‌దే అధిక్యం..!

Thursday, March 18th, 2021, 10:06:38 PM IST


తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ముందంజలో కొనసాగుతున్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మూడో రౌండ్ పూర్తయ్యింది. మూడో రౌండ్‌లో 4,444 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి ముందంజలో ఉన్నారు. ఇక మూడు రౌండ్లలో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 53,007 ఓట్లు రాగా, బీజేపీకి 48,563 ఓట్లు, కాంగ్రెస్‌కి‌ 15,035, ప్రొ.నాగేశ్వర్‌‌కు 25,505 ఓట్లు వచ్చాయి. మూడు రౌండ్లలో కలిపి మొత్తం 10,082 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు.

ఇదిలా ఉంటే నల్గొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఐదు రౌండ్లు పూర్తి అయ్యాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి 18,549 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఐదు రౌండ్లలో కలిపి మొత్తం పల్లా రాజేశ్వర రెడ్డికి 79,113 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్నకు 60,564 ఓట్లు, కోదండరాంకు 49,200 ఓట్లు వచ్చాయి. ఐదు రౌండ్లల్లో కలిపి మొత్తం 15,533 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు.