నారా లోకేష్ ఓ రాజకీయ అజ్ఞాని – ఎమ్మెల్సీ శమంతకమణి

Sunday, October 25th, 2020, 11:00:11 PM IST

తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీరు పై వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ శమంతకమణి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఓ రాజకీయ అజ్ఞాని అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెడుతున్న పథకాల పై నారా లోకేష్ ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పథకం, వైఎస్సార్ జలకళ కింద ఉచిత బోరు బావులు వేస్తున్న సంగతి తెలియదా అంటూ వరుస విమర్శలు చేశారు.

అయితే చంద్రబాబు నాయుడు అధికారం లో ఉండగా, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని, ఆ రైతు కుటుంబాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదుకున్న విషయం నారా లోకేష్ కి తెలియదా అంటూ ధ్వజమెత్తారు. అంతేకాక రైతులకు మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు లోకేష్ కి కనిపించడం లేదా అంటూ నిలదీశారు. అంతేకాక ఇటీవల భారీగా కురిసిన వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్సీ తెలిపారు.