తెలుగు రాష్ట్రాల్లో మొదలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Sunday, March 14th, 2021, 08:59:28 AM IST


తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గానూ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే తెలంగాణ రాష్ట్రం లో మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ మరియు ఖమ్మం – నల్గొండ – వరంగల్ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఉభయ గోదావరి మరియు కృష్ణా – గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల కొరకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం లో అధికార పార్టీ కి చెందిన నేతలు, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ షేక్ పేట తహశీల్దార్ కార్యాలయం లో ఓటు వేశారు. అయితే ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందర్భం గా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యావంతులు అంతా కూడా సమర్దుల కే ఓటు వేయాలని సూచించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలని అన్నారు. విద్యావంతులు దూరంగా ఉంటారు అనే అపోహ ను తొలగించాలని మంత్రి వ్యాఖ్యానించారు.