స్టార్ క్యాంపెయినర్ల జాబితా రిలీజ్ చేసిన టీఆర్ఎస్.. కవితకు నో ఛాన్స్..!

Saturday, November 21st, 2020, 12:06:44 AM IST


గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. అయితే మరోసారి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ మొత్తం 150 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలిపి వారికి బీఫాంలను కూడా అందించింది. ఇక ప్రచారానికి సంబంధించి నేతలకు దిశా నిర్దేశాలు చేసిన టీఆర్ఎస్ దానికి సంబంధించి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా ప్రకటించింది. సీఎం కేసీఆర్‌తో సహా మొత్తం 10 మందికి ఆ జాబితాలో చోటు లభించింది.

అయితే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాత్రం చోటు లభించలేదు. గ్రేటర్‌లో పలువురు టీఆర్‌ఎస్ అభ్యర్థలు నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ కవిత చాలా యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ప్రతిపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ టీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు. అయితే ఇంత యాక్టివ్‌గా వ్యవహరిస్తున్న కవితకు స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో చోటు దక్కకపోవడం పట్ల పలువురు టీఆర్ఎస్ నేతలు నిరాశకు గురయ్యారు. అయితే స్టార్ క్యాంపెయినర్స్ జాబితా సీఎంతో పాటు కేవలం మంత్రులకు మాత్రమే చోటు కల్పించారని అందుకే కవితకు చోటు దక్కలేదని పలువురు భావిస్తున్నారు.

టీఆర్‌ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితా

1. సీఎం కేసీఆర్
2. కేటీఆర్
3. హరీష్ రావు
4. మహమూద్ అలీ
5. ఈటల రాజేందర్
6. తలసాని శ్రీనివాస్ యాదవ్
7. కొప్పుల ఈశ్వర్
8. సబితా ఇంద్రారెడ్డి
9. పువ్వాడ అజయ్
10. సత్యవతి రాథోడ్