5 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో కి ఎమ్మెల్సీ కవిత

Wednesday, October 14th, 2020, 02:12:20 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా అధికార పార్టీ కి చెందిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే నిన్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత భారీ విజయం సాధించడంతో ఎమ్మెల్యే హజరు అయి, ప్రత్యేక హృదయ పూర్వక అభినందలు తెలిపారు.అయితే ఎమ్మెల్యే కి కరోనా వైరస్ నిర్దారణ అవ్వడం తో అతనిని కల్సిన వారు కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి అని, హోమ్ క్వారంటైన్ లో ఉండాలి అని తెలిపారు.

అయితే ఈ మేరకు కవిత సోషల్ మీడియా ద్వారా తాను హోమ్ క్వారంటైన్ కి వెళ్తున్నట్లు తెలిపారు. అయిదు రోజుల పాటు అలా ఉండనున్నారు. అయితే కొద్ది రోజుల పాటు తనను కలవడానికి ఎవరూ కూడా రావొద్దు అని సూచించారు. అంతేకాక కరోనా వైరస్ సోకిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.