ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు – కవిత

Monday, October 12th, 2020, 11:10:38 PM IST

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కల్వకుంట్ల కవిత భారీ విజయం సాధించడంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ మేరకు ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కవిత కలిశారు. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కవిత తెలిపారు. అయితే ఈ విజయానికి కృషి చేసినటువంటి తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లకు, ఎంపీ లకు, జెడ్పిటీసి, ఎంపీపీ, కార్పొరేటర్ లకు కౌన్సిలర్ లకు కవిత ధన్యవాదాలు తెలిపారు.

అయితే నేడు జరిగిన కౌంటింగ్ లో కవిత తెరాస తరపున 728 ఓట్లు తెచ్చుకున్నారు. బీజేపీ కి 56 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ కి 29 ఓట్లు వచ్చాయి. దీంతో కవిత 14 వ ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉప ఎన్నికలో భారీ విజయం సాధించడంతో తెరాస నేతలు ఆనందం లో మునిగి ఉన్నారు.