మోడీ పుణ్యమా అంటూ దేశం మొత్తం రోడ్డెక్కింది – ఎమ్మెల్సీ కవిత

Tuesday, December 8th, 2020, 04:30:06 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల ను పూర్తి గా వ్యతిరేకిస్తుంది తెరాస ప్రభుత్వం. ముందు నుండి ఈ విషయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. అయితే తెరాస నేత, ఎమ్మెల్సీ కవిత మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ పుణ్యమా అంటూ దేశం మొత్తం రోడ్డెక్కింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులని ఉపసంహరించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. అయితే రైతుల నడ్డి విరిచే విధంగా మోడీ పాలన కొనసాగుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్ బంద్ అంటూ రైతుల తలపెట్టిన నిరసన లో తెరాస నేతలు పాల్గొన్నారు. కామారెడ్డి జాతీయ రహదారి పై ఎమ్మెల్సీ కవిత బైఠాయించారు. కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ నిరసనగా నల్ల బెలూన్ లని గాల్లోకి వదిలారు కవిత. అయితే తెరాస ప్రభుత్వం రైతులకి పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది అని తెలిపారు. కవిత చేసిన వ్యాఖ్యలు మరొకసారి హాట్ టాపిక్ గా మారాయి.