వారికి ఓటు అడిగే హక్కు లేదు…ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

Thursday, November 19th, 2020, 02:54:26 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం కావడం తో అధికార పార్టీ పై ప్రతి పక్ష పార్టీ నేతలు, ప్రతి పక్షాల పై అధికార పార్టీ నేతలు వరుస విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే గాంధీ నగర్ డివిజన్ తెరాస అభ్యర్ధి అబిడ్స లోనీ GHMC కార్యాలయం లో నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ, మరియు బీజేపీ లు పేద ప్రజల నోటి కాడి ముద్దను లాక్కున్నాయి అని ఆరోపించారు. కరోనా, హైదరాబాద్ ప్రాంతం లో వరదలు వచ్చినప్పుడు తెరాస ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచింది అని అన్నారు. అయితే వరదల్లో నష్టపోయిన పేద ప్రజలకు ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంటే, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు అంటూ కవిత ప్రతి పక్ష పార్టీ ల పై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ మహ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం 67 వేల కోట్ల రూపాయలతో అభివృద్ది చేసింది అంటూ కవిత వివరించారు. అయితే జాతీయ పార్టీలు అని చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్ లు వరదలు వచ్చిన సమయం లో ప్రజలను పట్టించుకోలేదు అని తెలిపారు. అయితే ఈ GHMC ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు అని కవిత అన్నారు.