ఆ చట్టాల్లో కనీస మద్దతు ధర పై హామీ లేదు – కవిత

Sunday, December 6th, 2020, 09:20:13 PM IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ చట్టాల బిల్లులు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల, బిల్లుల పట్ల తెరాస నేత, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల్లో ఏ ఒక్క దానిలోనూ పంటలకు కనీస మద్దతు ధరపై హామీ లేదని కవిత అన్నారు.అయితే ఈ అంశం కారణంగానే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాం అని తెలిపారు. ఎప్పటికీ ఆ బిల్లులకు వ్యతిరేకం అంటూ కవిత వివరించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు మండీల సంస్కృతి ను ద్వంసం చేసేలా ఉన్నాయి అని ల, మండీలు కనుమరుగు అయితే దేశం లో వాటికి ప్రత్యామ్నాయం లేదు అని స్పష్టం చేశారు. అందుకే రైతులు అభద్రతా భావం తో బిల్లులకు వ్యతిరేకం గా పోరాడుతున్నారు అంటూ కవిత వివరించారు. అంతేకాక ఈ నెల 8 న రైతుల తలపెట్టిన భారత్ బంద్ కి సంపూర్ణ మద్దతు తెరాస ఇస్తుంది అని తెలిపారు.