సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత భర్తకు కరోనా పాజిటివ్..!

Thursday, March 25th, 2021, 01:06:43 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కవిత తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. నా భర్త అనిల్ కరోనా బారిన పడ్డారని, ప్రస్తుతం మా కుటుంబ సభ్యులమంతా క్వారంటైన్‌లో ఉన్నామని, పరిస్థితులు చక్కదిద్దుకునే వరకు తమను కలిసేందుకు ఎవరూ రావద్దని, తమ ఆఫీసును కూడా మూసేశామని చెబుతూ కవిత ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నేటి నుంచి అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసివేసింది. అంతేకాదు డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలను కూడా వాయిదా వేసింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీనీ మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుంది.