సీఎం కేసీఆర్ ట్రాన్స్ జెండర్ అయ్యారు.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Saturday, January 9th, 2021, 09:40:35 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కేసీఆర్ జగీర్ కాదని అన్నారు. రైతు బంధు పథకం పచ్చి మోసమని, రైతుకు మద్దతు ధర ప్రకటించటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ధాన్యం కొనుగోలు చేయకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలను గ్రామాల్లో తిరగనియ్యమని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

అంతేకాదు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ముందు వ్యతేరికిస్తున్నామని మంత్రులను రోడ్లపై కూర్చో పెట్టిన కేసీఆర్ చివరకు యూ టర్న్ తీసుకున్నారని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయని అన్నారు. మోదీకి మొగుడిని అవుతానంటూ ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ చివరకు ట్రాన్స్ జెండర్ అయ్యారని శిఖండిగా మారారని ఎద్దేవా చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని, ధాన్యం కొనుగోలుకు దుకాణాలు తెరవకుంటే‌‌ టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని అన్నారు.