సీఎం వ్యాఖ్యలు అటు రాజ్యాంగాన్ని, ఇటు తెలంగాణ ప్రజల్ని అవమానించినట్లే

Tuesday, February 9th, 2021, 09:47:57 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పట్ల ప్రతి పక్ష పార్టీ నేతలు బీజేపీ మరియు కాంగ్రెస్ కి చెందిన వారు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిలిసై ను కలిశారు. ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి తెరాస అధినేత, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై విచారణ జరిపి, రాజ్యాంగ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్ తమిలిశై కి జీవన్ రెడ్డి ఈ మేరకు ఒక లేఖ రాశారు. అయితే ముఖ్యమంత్రి పదవి తన ఎడమ కాలి చెప్పు తో సమానం అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు పత్రికల్లో వచ్చింది అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే సీఎం కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అటు రాజ్యాంగాన్ని ఇటు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమే అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇదే లేఖ ను ప్రభుత్వ కార్యదర్శి కి కూడా పంపినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే బీజేపీ నేతలు సైతం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం పదవి నుండి తొలగించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ గవర్నర్ ను కోరారు.కాలి చెప్పుతో సీఎం పదవి నీ పోల్చడం పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెరాస పార్టీ లో సీఎం కేసీఆర్ పై నమ్మకం సన్నగిల్లింది అని, ఎమ్మేల్యే లలో నమ్మకం పోయింది అని, అందుకే ఈ సమావేశాలు అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల జరుగుతున్న పరిణామాల తో సీఎం కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారు అని, ఎమ్మెల్యే ల పై బెదిరింపు లకు పాల్పడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.