మైనారిటీ లకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం కేవలం వైఎస్ జగన్ కే సాధ్యం – ఎమ్మెల్సీ జకియా

Monday, August 10th, 2020, 07:10:03 PM IST

గవర్నర్ కోటా లో జకియా ఎమ్మెల్సీ గా ఎన్నికైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈమె మరో ఆరేళ్ల పాటు ఈ పదవి లో ఉండనున్నారు. అయితే నూతన ఎమ్మెల్సీ గా ఎన్నిక అయిన జకీయా నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సీఎం జగన్ ను కలిసి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య కుటుంబానికి చెందిన తువంటి వ్యక్తి ను ఎమ్మెల్సీ గా ఎంపిక చేయడం పట్ల జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్య వాదాలు తెలిపారు.

అయితే సీఎం జగన్ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని రాయచోటి అభివృద్ది కోసం కృషి చేస్తా అని అన్నారు. అంతేకాక మైనారిటీ లకు ఇంత గా ప్రాధాన్యత ఇవ్వడం కేవలం జగన్ మోహన్ రెడ్డి గారికే సాధ్యం అవుతుంది అని ప్రశంసలు కురిపించారు. అంతేకాక మహిళల యొక్క సమస్యల పై పోరాటం చేసి పరిష్కారం కోసం కృషి చేస్తా అని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అయితే ఈ నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈ విషయం పై స్పందించారు.మైనారిటీ మహిళలకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఆనందం గా ఉంది అని, సీఎం జగన్ ఇచ్చిన మాట ను ఎన్నడూ కూడా తప్పలేదు అని తెలిపారు.